క్రికెట్‌కు కెవిన్ పీటర్సన్‌ గుడ్ బై..

SMTV Desk 2018-03-18 12:12:01  kevin pietersen, psl league,, england batsmen, dubai

దుబాయి, మార్చి 18 : ఇంగ్లాండ్‌ జట్టులో మంచి ప్రతిభావంతుడిగా, అరుదైన బ్యాట్స్‌మెన్‌గా పేరు తెచ్చుకున్నకెవిన్ పీటర్సన్‌ తన క్రికెట్‌ కెరీర్‌కు గుడ్ బై చెప్పేశాడు. ప్రస్తుతం అతను పాకిస్థాన్‌ క్రికెట్‌ ప్రీమియర్‌ (పీఎస్ఎల్) లీగ్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్‌ తరఫున బరిలోకి దిగాడు. ఇక తన పూర్తి సమయం కుటుంబానికే కేటాయిస్తానంటూ వెల్లడించాడు. ‘బూట్స్‌ అప్‌! కృతజ్ఞతలు!’ అని ట్వీట్‌ చేశారు. అనేక వివాదాల ద్వారా వివాదాస్పద క్రికెటర్‌గానూ ఆయన వార్తల్లో నిలిచాడు. 2013-14 యాషెస్‌ సిరీస్‌లో పేలవ ఫాం కారణంగా పీటర్సన్‌ను ఎంపిక చేయకపోవడంతో అతడి కెరీర్‌ అనూహ్యంగా ముగిసింది. తర్వాత ప్రపంచవ్యాప్తంగా అతడు అనేక లీగ్‌ టోర్నీలు ఆడాడు. పీటర్సన్‌ తన అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌లో మొత్తం 104 టెస్టులు, 136 వన్డేలు, 37 టీ20లు ఆడాడు. అంతేకాకుండా ఐపీఎల్‌లో బెంగళూర్‌, ఢిల్లీ, పుణె జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.