దేశ రక్షణలో రాజీ లేదు: రాజ్‌నాథ్‌

SMTV Desk 2018-03-18 10:57:17  security forces, Control line, HomMinister Rajnath Singh, jammu kashmir

న్యూఢిల్లీ, మార్చి 18: భారత దేశ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునేందుకు అవసరమైతే మరోసారి భారత దళాలు లక్షిత దాడులకు సిద్ధమవుతాయని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. జమ్మూకశ్మీర్‌ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగంగానే ఉంటుందని స్పష్టం చేశారు. నివారం ఢిల్లీలో జరిగిన న్యూస్‌ 18 రైజింగ్‌ ఇండియా సమిట్‌లో ఆయన ప్రసంగించారు. ‘భారత్‌ను అంతర్గతంగా భద్రంగా ఉంచుకుంటాం. అంతేకాదు అవసరమైతే.. దేశాన్ని రక్షించుకునేందుకు సరిహద్దులు దాటి ముందుకు వెళ్తాం’ అని వ్యాఖ్యానించారు.