పీఎన్‌బీ కుంభకోణం పై ఉపరాష్ట్రపతి ఆందోళన

SMTV Desk 2018-03-17 17:21:02  pnb, scam, indian, vice president, venkaiah naidu

న్యూఢిల్లీ, మార్చి 17 : పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు(పీఎన్‌బీ) కుంభకోణం మన వ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీసిందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో నిర్వహించిన ఇన్స్‌టిట్యూట్‌ ఆఫ్‌ కాస్ట్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా సదస్సుకు ఉపరాష్ట్రపతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నైతిక నిబద్ధమైన కార్పొరేట్‌ గవర్నెన్స్‌...మరింత పారదర్శకత, జవాబుదారితనం... తక్షణావసరాన్ని నొక్కి చెప్పిన పరిణామంగా పీఎన్‌బీ కుంభకోణాన్ని అభివర్ణించారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది కనువిప్పు కలిగించిన వ్యవహారమని పేర్కొన్నారు. మనం ఇప్పుడు ‘ఎల్‌.పి.జి’(లిబరలైజేషన్‌, ప్రయివేటైజేషన్‌, గ్లోబలైజేషన్‌) శకంలో ఉన్నాం అని ఆయన పేర్కొన్నారు. విజయ్‌మాల్యా, నీరవ్‌ మోదీ తదితరులు వ్యవస్థనే మోసం చేశారని పేర్కొన్నారు.