నేనే సూపర్ హీరో : బాలయ్య

SMTV Desk 2018-03-17 17:18:17  hindupuram MLA, balakrishna, pawan kalyan,

అమరావతి, మార్చి 17 : సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. అనంతపురం పట్టణంలోని ఎంజీఎం క్రీడా మైదానంలో ఇండోర్‌ స్టేడియం మరమ్మతుకు రూ.2కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే ఓ ప్రైవేటు ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మీ స్పందన ఏంటి.? అని మీడియా అడుగగా.. "ఒకరిని హీరో చేయడం నాకు ఇష్టం లేదు.. నేనే సూపర్ హీరో" అంటూ పేర్కొన్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ గుంటూరులో నిర్వహించిన మహాసభలో ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించిన విషయం తెలిసిందే.