ఆ మాటల్లో నిజం లేదు: షమీ

SMTV Desk 2018-03-17 15:08:31  mohammad shami, Hasin Jahan, indian cricket team, kolkatha

కోల్‌కతా, మార్చి 17 : టీమిండియా పేసర్ మహ్మద్‌ షమీ తన భార్య హసీన్‌ జహాన్‌పై లైంగిక దాడి జరిగిందన్న మాటల్లో నిజం లేదని స్పష్టం చేశాడు. భార‍్య హసీన్‌ను తన సోదరుడు అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడన్న వార్తలపై స్పందించిన షమీ.. "హాసిన్ చెబుతున్నట్లు డిసెంబర్ 7న నా సోదరుడు ఇక్కడ లేడు.ముర్దాబాద్‌లో ఉన్నాడు. భువనేశ్వర్ కుమార్ రిసెప్షన్‌కు డిసెంబర్ 6న ఆమె, నేను కలిసి వెళ్లా౦. రిసెప్షన్‌ ముగిసిన తర్వాత డిసెంబర్ 7న మధ్యాహ‍్నం గం.3.30ని.లకు మా హోమ్‌ టౌన్‌కు వచ్చాం. అలాంటప్పుడు నా సోదరుడు ఆమెపై అత్యాచారం ఎలా చేస్తాడు..? అవి అవాస్తవ ఆరోపణలు. ఈ కేసుపై లోతుగా విచారణ జరపాలని నేను పోలీసులను కోరుకుంటున్న" అని వ్యాఖ్యానించాడు.