మొయిలీ ట్వీట్ కాంగ్రెస్ షాక్

SMTV Desk 2018-03-17 10:55:43  assembly, elections, congress party, money, veerappa moili

బెంగళూరు, మార్చి 16: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు కూతవేటు దూరంలో ఉన్న సమయంలో, కాంగ్రెస్ నేత వీరప్పమొయిలీ చేసిన టీట్ కాంగ్రెస్‌ను ఇరకాటంలో పడేసింది. ‘రాజకీయాలకు డబ్బు చాలా ముఖ్యం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఆశించేవాళ్లు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోక తప్పదు’ అంటూ మొయిలీ చేసిన ట్వీట్ రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది. అయితే, ఈ ట్వీట్ చేసింది తాను కాదని మొయిలీ స్పష్టం చేయడం గమనార్హం. ‘రాజకీయాల్లో ధన ప్రవాహాన్ని నియంత్రించాల్సిన అవసరం కాంగ్రెస్‌కు ఉంది. కాంట్రాక్టర్లు వాళ్ల బంధువర్గానికి అవకాశాలు ఇవ్వకూడదు. అలా అయితే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను ఎంపిక చేయడం కష్టమేనన్న అభిప్రాయంతో పిడబ్ల్యుడి మంత్రి ఉన్నారు’ అంటూ మొయిల్ ఖాతా నుంచి ట్వీట్ వెలువడింది. సోషల్ మీడియాలో ఇది వైరల్ కావడంతో రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది.