ఏపీ జర్నలిస్టులకు త్రిబుల్ బెడ్రూం ఇల్లు..!

SMTV Desk 2018-03-16 18:22:04  ap journalists, triple bedroom house, ap cm, chandrababu naidu.

అమరావతి, మార్చి 16 : ఏపీ ప్రభుత్వం జర్నలిస్టులకు ఉగాది కానుకను ప్రకటించింది. రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులందరికీ త్రిబుల్ బెడ్రూం ఇళ్లను కట్టించి ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జీవో విడుదల చేశారు. ఈ అంశంపై పక్కా ప్రణాళికలను రూపొందించేందుకు ఒక కమిటీని సైతం సిద్దం చేశారు. ఇందులో భాగంగా కమిటీ చైర్మన్ గా ఐ అండ్ పీఆర్, రూరల్ హౌసింగ్ శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు నియమితులయ్యారు. అంతేకాకుండా కమిటీ మెంబర్లుగా అర్బన్ హౌసింగ్ మినిస్టర్ నారాయణ, ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్, కన్వీనర్‌గా సమాచార శాఖ ఈవో సెక్రటరీ వెంకటేశ్వర్ లను నియమిస్తున్నట్లు ప్రకటించారు.