విడాకుల కోసం కోర్టుకెక్కిన ట్రంప్‌ కోడలు

SMTV Desk 2018-03-16 17:33:37   vanessa trump, files for divorce, newyork , court

వాషింగ్టన్, మార్చి 16‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కోడలు వానెస్సా విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. 2005 నవంబర్‌లో ట్రంప్‌ పెద్ద కుమారుడు జూనియర్‌ ట్రంప్‌ను వానెస్సా వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ ఐదుగురు సంతానం. దంపతులిద్దరూ సామరస్యంగా చర్చించుకుని విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పలు మీడియా వర్గాలు వెల్లడించాయి. పిల్లల సంరక్షణ, ఆస్తుల వివాదాల పరిష్కారం కంటే ముందే తనకు విడాకులు మంజూరు చేయాలని ఆమె కోరారు. ఈ మేరకు న్యూయార్క్‌లోని ఓ కోర్టులో పిటిషన్‌ దాఖలుచేశారు.