మళ్ళీ మోడలింగ్ వైపు బిపాసా..!

SMTV Desk 2018-03-16 17:33:00  bipasa basu, modeling , mumbai.

ముంబై, మార్చి 16 : మోడలింగ్ రంగంలోకి మళ్ళీ అడుగులేస్తున్న బిపాసా బసు. ఇండియన్ సూపర్ మోడల్ గా ఓ వెలుగు వెలిగిన బిపాసా.. సినీ అవకాశాల రాకతో సినీరంగ ప్రవేశం చేసింది. మొదట్లో మంచి అవకాశాలు చేజిక్కించుకున్న ఈ భామ.. హర్మాన్ బవేజా, డినో మోరియా, జాన్ అబ్రహాం, క్రిస్టియానో రొనాల్డోలతో ప్రేమాయణం సాగించి.. చివరకు కరణ్ సింగ్ గ్రోవర్ ను వివాహం చేసుకుంది. వివాహానంతరం అవకాశాలు పూర్తిగా తగ్గడంతో మళ్లీ మోడలింగ్ వైపు మొగ్గు చూపుతుంది. తాజాగా ఢిల్లీలో డిజైనర్ షోలో పాల్గొన్న బిపాసా.. తాను మళ్లీ మోడల్ గా మారానని, మోడలింగ్ గొప్ప వృత్తి అని వెల్లడించింది.