ఎన్డీయే వ్యతిరేక శక్తులన్ని ఏకం కావాలి: మమత బెనర్జీ

SMTV Desk 2018-03-16 16:04:19  nda, opposite, parties, unity, cm, mamatha benarji

కోల్‌కత్తా, మార్చి 16: రాజకీయ అస్థిరతకి వ్యతిరేకంగా పోరాడటానికి ఎన్డీయే వ్యతిరేక శక్తులన్ని ఏకం కావాలని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీ పిలుపునిచ్చారు. ఏపీ ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రానికి బీజేపీ తీవ్ర అన్యాయం చేసిందని ఆమె ఆరోపించారు.ఎన్డీయే కూటమి నుంచి బయటకు రావాలన్న టీడీపీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని మమతా బెనర్జీ శుక్రవారం ట్విట్‌ చేశారు. రానున్న ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ప్రాంతీయ పార్టీలన్ని ఏకం కావాలని కోరారు.