పొట్టి శ్రీరాములుకు ఏపీ శాసనమండలి నివాళి..

SMTV Desk 2018-03-16 15:20:13  ap assembly meeting, candrababu naidu, SRI POTTI SREERAMULU..

అమరావతి, మార్చి 16 : నేడు అమరవీరులు శ్రీ పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకొని.. ఏపీ శాసనమండలి నివాళులర్పించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధనకు పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం చేశారని.. ఆయన త్యాగం మరువలేనిదన్నారు. పొట్టిశ్రీరాములు ఆమరణ నిరాహారదీక్ష చేపడితే.. ఆంధ్ర ప్రజలంతా ఆయన వెంట నడిచారని గుర్తుచేశారు. అంతేకాకుండా ప్రజానీకం కోసం ఆయన క్విట్ ఇండియా ఉద్యమ౦లో పాల్గొని జైలుకు సైతం వెళ్ళారని.. ఆయన త్యాగం వల్లే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి౦దని వెల్లడించారు.