ఈపీఎస్‌ పెన్షన్‌ దారులకు శుభవార్త..!

SMTV Desk 2018-03-16 14:45:56  eps pension, pm modi, central govt, monthly 2000 pension.

న్యూఢిల్లీ, మార్చి 16 : ఉద్యోగ భవిష్య నిధికి చెందిన ఉద్యోగ పింఛను పథకం(ఈపీఎస్‌) పెన్షన్‌ దారులకు శుభవార్త. ప్రస్తుతం ఈ స్కీం కింద అందిస్తున్న నెలవారీ కనీస పింఛను రూ.1,000 గా ఉంది. ఇకపై నెలవారీ చెల్లింపులు రూ. 2వేల చొప్పున ఇవ్వాలని మోదీ సర్కారు యోచిస్తున్నట్లు సమాచారం. ఈ పథకం అమల్లోకి వస్తే దాదాపు 40లక్షల మందికి ప్రయోజనం చేకూరనున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వంపై మాత్రం రూ.3వేల కోట్ల భారం పడనుందని సీనియర్‌ ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయని త్వరలోనే అమలులోకి వస్తాయని పేర్కొన్నారు.