తెగిన బంధం.. @టీడీపీ.. ఎన్డీయే

SMTV Desk 2018-03-16 12:45:47  ap cm, chandrababu, central govt, teleconference, nda govt

అమరావతి, మార్చి 16 : ఎన్డీయే ప్రభుత్వం నుండి తెలుగుదేశం పార్టీ తెగదెంపులు చేసుకుంది. టీడీపీ సభ్యులు.. అత్యున్నత స్థాయి పొలిట్ బ్యూరో సభ్యులతో ముఖ్యమంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్డీయే నుండి వైదొలగాలని ఈ మేరకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. అసలు ఎందుకు పొత్తు పెట్టుకున్నాం.? ఎందుకు విడిపోతున్నాం.? ఈ నాలుగేళ్లలో ఏం జరిగింది అనే విషయాలను వివరిస్తూ.. భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు వాస్తవ వివరాలతో లేఖ రూపొందించారు. అంతేకాకుండా సొంతంగా కేంద్రంపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వాలని నిర్ణయించారు. అవిశ్వాసంపై వైకాపాకు మద్దతిస్తే ప్రజలలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని.. అందుకే ప్రత్యేకంగా టీడీపీ పార్టీ కేంద్రంపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇస్తుందని వెల్లడించారు. ప్రత్యేక హోదాపై మిగతా పార్టీలన్ని అనుకూలంగానే ఉన్నాయన్న చంద్రబాబు.. తమకు ప్రజాప్రయోజనాలే ముఖ్యమంటూ పేర్కొన్నారు.