ఆల్‌ ఇంగ్లాండ్‌ నుండి నిష్క్రమించిన శ్రీకాంత్‌..

SMTV Desk 2018-03-16 12:19:20  all england badminton, kidambi srikanth, p.v sindhu, h.s pranay

బర్మింగ్‌హామ్‌, మార్చి 16: భారత బ్యాడ్మింటన్ అభిమానులకు ఊహించని షాక్..ఆల్‌ ఇంగ్లాండ్‌ ఛాంపియన్‌షిప్‌ నుంచి భారత అగ్రశ్రేణి ఆటగాడు కిదాంబి శ్రీకాంత్‌ నిష్క్రమించాడు. గత సంవత్సరం నాలుగు సూపర్‌ సిరీస్‌ టైటిళ్లు గెలిచి మంచి ఫామ్‌లో ఉన్న శ్రీకాంత్‌ ఈ టోర్నీలో ప్రిక్వార్టర్స్‌లోనే ఇంటి ముఖం పట్టాడు. ప్రిక్వార్టర్స్‌లో భాగంగా చైనాకు చెందిన హుయాంగ్‌తో చేతిలో ఓటమి పాలయ్యాడు ఈ టోర్నీలో భారత్ తరపున పీ.వీ.సింధు, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ రేస్ లో మిగిలారు. క్వార్టర్స్‌లో భాగంగా ఈ రోజు సింధు.. జపాన్‌ క్రీడాకారిణి ఒకుహారాతో తలపడనుంది. మరో మ్యాచ్‌లో ప్రణయ్, శ్రీకాంత్‌పై విజయం సాధించిన హుయాంగ్‌తో తలపడనున్నాడు.