పవన్ ను టార్గెట్ చేసిన నటి పూనమ్..?

SMTV Desk 2018-03-16 11:24:23  PoonamKaur, Pawankalyan, Poonam Attacks On Pawan Kalyan, Again.

హైదరాబాద్, మార్చి 16 : ఆ మధ్య పవన్ కళ్యాణ్, క‌త్తి మహేష్ ల మధ్య ట్విట్టర్ లో జరిగిన సమరంలో నటి పూనమ్ కౌర్ జోక్యం చేసుకొని కత్తి మహేష్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ విషయ౦లో పవన్ కళ్యాణ్ అభిమానులు తనకు సపోర్ట్ గా నిలవాలని కోరింది. తాజాగా పూనమ్ తన ఫేస్ బుక్ ఖాతాలో సంచలన వ్యాఖ్యలు చేసి౦ది. ఇప్పుడు ఆమె చేసిన పోస్టులు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. "కాన్సెప్ట్స్ కాపీ చేసి, డైలాగ్స్ కాపీ చేసి, బట్టలు మార్చుకుంటూ, మనుషులను మారుస్తూ, మాట మీద ఉండకపోవడం, జనాల అమాయకత్వంతో ఆడుకోవడం, వేష భాషలు మారుస్తూ జనాల్ని మభ్యపెట్టి అమ్మాయిలను అడ్డం పెట్టుకుంటూ రాజకీయాలు చేస్తున్నారు కొంతమంది. ఆ భగవంతుడే నిజం ఏంటో అని తెలియజేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా" అంటూ పేర్కొంది. పవన్ ను టార్గెట్ చేస్తూ పూనమ్ ఈ వ్యాఖ్యలు చేసిందంటూ పలువురు ఆరోపిస్తున్నారు. మరి ఈ విషయంపై పూనమ్ కౌర్ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.