కేసిఆర్ ది ఫ్రంట్ కాదు.. స్టంట్: జైపాల్ రెడ్డి

SMTV Desk 2018-03-16 11:20:30  telanagana, cm, front, stunt, comment,

న్యూఢిల్లీ, మార్చి 15:: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రారంభించేది ఫ్రంట్ కాదు.. స్టంట్ అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైపాల్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన ఒకసారి ఫెడరల్ ఫ్రంట్ అంటాడు.. మరోసారి తృతీయ ఫ్రంట్ అంటాడు..అని అభివర్ణించారు. గురువారం పార్లమెంటు ఆవరణలో జైపాల్ రెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ కేసిఆర్ నియంతృత్వంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా శాసనసభలో జరిగిన సంఘటనలను అడ్డం పెట్టుకుని ఇద్దరు కాంగ్రెస్ సభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేయటం, రాజ్యాంగ విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. దేశం మొత్తం దీనిని ఖండించాలన్నారు. 11 మంది సీనియర్ నాయకులను బహిష్కరించటం దుర్మార్గమని, ఆరోపించారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రజల మద్దతు కోల్పోతోంది.. అందుకే కేసీఆర్ ఈ విధంగా వ్యవహరిస్తున్నారని జైపాల్ రెడ్డి చెప్పారు. చంద్రశేఖరరావు ఢిల్లీకి వచ్చి ఏం చేస్తారని ఆయన ప్రశ్నించారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీ మినహా మరే ఇతర పార్టీ పని చేయలేదన్నారు.