సర్కారు కొలువుకు తెలుగు..: వెంకయ్యనాయుడు

SMTV Desk 2018-03-15 18:15:10  state, government, jobs, telugu, language

న్యూఢిల్లీ, మార్చి 15: తెలుగు భాషకు తెలుగు రాష్ట్రాల్లోనే ప్రాధాన్యం తగ్గిపోతోందని, ప్రభుత్వ కొలువులకు తెలుగు భాష పరిజ్ఞానాన్ని ముడిపెడితే తెలుగు భాషాభివృద్ధి చెందుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. బుధవారం తన నివాసంలో పలు విశ్వవిద్యాలయాలకు చెందిన తెలుగు ఆచార్యులతో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగార్జనతో ముడిపెడితే మంచి ఫలితాలు వస్తాయన్నారు. బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు వెంకటేశ్వర్లు, విశ్వనాథ్‌, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రొ.రామనరసింహం, మద్రాసు వర్సిటీ ప్రొ.జీవీఎస్‌ఆర్‌ కృష్ణమూర్తి, సంపత్‌కుమార్‌లు ఉపరాష్ట్రపతిని కలిశారు. తెలుగు భాషాభివృద్ధికి చేపట్టాల్సిన చర్యల గురించి ఉపరాష్ట్రపతితో చర్చించారు.