ఎలక్ట్రానిక్ మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి: సుప్రీంకోర్టు

SMTV Desk 2018-03-15 17:52:20  

న్యూఢిల్లీ, మార్చి 15: ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్‌సైట్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సుప్రీం కోర్టు ధర్మాసనం పేర్కొంది. నిరాధారమైన పరోక్ష నిందలను ప్రచురించరాదని, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఈ హెచ్చరిక చేసింది. బాధ్యతాయుతమైన పాత్రికేయానికి ఉన్న ప్రాధాన్యాన్ని నొక్కివక్కాణించింది. ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్‌సైట్లు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం ఉందని తెలిపింది.