ఉదయి కిరణ్ చనిపోవడానికి కారణం...

SMTV Desk 2017-06-28 18:35:16  udayikiran, death, shivajiraja, talk

హైదరాబాద్, జూన్ 28 : ఉదయ కిరణ్ చనిపోవడానికి కారణం సినీ పరిశ్రమే.............ఇక్కడ ఎవరి స్వార్ధం వారిదే , బాధలో ఉన్న వారిని ఎవరు పట్టించుకోరు.... అని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు, సినీ యాక్టర్ శివాజీ రాజా పేర్కొన్నారు. ఉదయ కిరణ్ గుర్తుగా ప్రతి సంవత్సరం షార్ట్ ఫిలిం పోటీలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ ఏడాది కూడా పోటీలను నిర్వహించారు. హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ఈ షార్ట్ ఫిలిం పోటీలను జరిపించారు. అక్కడ విజేతలకు అయన బహుమానాలను, పురస్కారాలను అందించారు. ఈ సందర్భంలో శివాజీ రాజా మాట్లాడుతూ, ఉదయ కిరణ్ తో తనకు ఉన్న అనుబంధాన్ని, గుర్తు చేసుకున్నాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఉదయ కిరణ్ సినీ ఇండస్ట్రీ లో పైకి వచ్చాడు అని, కాని అర్థాంతరంగా తను మరణించడం దురదృష్టకరమని ఆయన తన ఆవేదన వ్యక్తం చేశారు. అపుడు కష్టాల్లో ఉన్న ఉదయ కిరణ్ ను సినీ పరిశ్రమ ఆదుకుని ఉంటె, ఈరోజు ఉదయ్ కిరణ్ మన మధ్య ఉండే వాడు అని, ఇలాంటి కర్యక్రమాన్ని నిర్వహించే దుస్థితి వచెది కాదు అని శివాజీ రాజా ఉద్వేగానికి లోనయ్యారు....