ఎన్ఆర్ఐల సాయం కోరిన జనసేనాని..

SMTV Desk 2018-03-15 14:37:42  JANASENA, PAWAN KALYAN, NRI MEETING, AP.

విజయవాడ, మార్చి 15 : జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఎన్ఆర్ఐ వింగ్ తో సమావేశం జరిపారు. వారి నుండి ఏపీ అభివృద్దికి సాయం అందించాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది. పవన్ తో భేటీ అనంతరం ఎన్ఆర్ఐలు మీడియాతో మాట్లాడారు. పార్టీకి నిధుల బ్యాంక్ గా పవన్ చూడలేదని.. కేవల ఆయన పార్టీ నెట్ వర్కింగ్‌లో మాత్రమే సహాయపడాలని కోరినట్లు తెలిపారు. అలాగే ప్రజా సమస్యలపై పోరాటం చేద్దామని అంతకు మించిన సాయం అవసరం లేదన్నారు.. పవన్ ఆలోచనలు చాలా బాగున్నాయని.. వారిని ఆచరణలోకి తీసుకువచ్చే విధంగా కృషి చేస్తామని పవన్ కు తెలిపినట్లు ఎన్ఆర్ఐలు వెల్లడించారు.