పది పరీక్షల్లో విరాట్..

SMTV Desk 2018-03-15 14:02:23  virat kohli, west bengal board exams, indian crickter, kolkatha

కోల్‌కతా, మార్చి 15 : టీమిండియా క్రికెట్ జట్టులో విరాట్ కోహ్లి అంటే తెలియని క్రీడాభిమానులు ఉండరు. ప్రపంచ దిగ్గజ క్రికెటర్ల రికార్డులను బద్దలగోడుతూ రాకెట్ ల దూసుకుపోతున్న విరాట్ పై పరీక్షల్లో ప్రశ్న వచ్చింది.. అదెక్కడో కాదు.. పదో తరగతి పరీక్షల్లో.. దీంతో విద్యార్ధుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం ఇంగ్లీష్‌ పరీక్ష జరిగింది. అందులో ‘విరాట్‌ కోహ్లీ గురించి రాయండి’ అని ఓ ప్రశ్న వచ్చిందంటా..! దీంతో విద్యార్థులు సంతోషంలో మునిగిపోయారు. రికార్డుల రారాజుగా పేరొందిన కోహ్లి కోసం రాయమంటే ఎవరో రాయరో చెప్పండి.‘ప్రశ్నపత్రంలో కోహ్లీపై ప్రశ్న చూడగానే చాలా ఆనందం కలిగింది. మరో నిమిషం ఆలోచించకుండా నాకు విరాట్ గురించి తెలిసిందంతా రాసేశాను. ఇది పది మార్కుల ప్రశ్న. పదికి పది వచ్చేస్తాయి’ అని పట్టరాని సంతోషంతో ఒక విద్యార్ధి చెప్పాడు