అయోధ్య కేసులో సుప్రీం కోర్టు కీలక నిర్ణయం

SMTV Desk 2018-03-15 12:48:59  ayodya, case, supreme court, judgement

న్యూఢిల్లీ, మార్చి 15: వివాదాస్పద అయోధ్యలోని రామమందిరం-బాబ్రీ మసీదు కేసులో సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కేసులో తమను కక్షిదారులుగా చేర్చాలంటూ దాఖలైన 32 మధ్యంతర పిటిషన్లను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా సారథ్యంలోని ప్రత్యేక ధర్మాసనం తోసిపుచ్చింది. తొలి నుంచి ఈ కేసులో ఉన్న కక్షిదారులు మాత్రమే వాదనలు వినిపించాలని బెంచ్ కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యలో ఏ కక్షిదారుణ్ని అనుమతించేది లేదని ప్రత్యేక ధర్మాసనం పేర్కొంటూ 32 మధ్యంతర పిటిషన్లను తిరస్కరించింది. అలహాబాద్‌ హైకోర్టులో ఈ కేసు విచారణ జరిగినప్పుడు.సినీ ప్రముఖుడు శ్యామ్‌బెనెగల్, బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి, అపర్ణాసేన్ తదితరుల వ్యాజ్యాలను కోర్టు తోసిపుచ్చింది. అయితే అయోధ్యలో పూజలు చేయడానికి తనకు ప్రాథమిక హక్కును కాపాడాలంటూ బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. అయోధ్య కేసులో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ 14 పిటిషన్లు దాఖలయ్యాయి. అలహాబాద్ హైకోర్టులోని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ 2:1 మెజారిటీతో తీర్పును వెలువరించింది.