తెలంగాణ బడ్జెట్‌ ముఖ్యాంశాలు..

SMTV Desk 2018-03-15 12:19:15  TELANGANA, BADGET MEETINGS, TS FINANCIAL MINISTER, ETELA RAJENDAR.

హైదరాబాద్, మార్చి 15 : తెలంగాణ రాష్ట్రంలో వరుసగా ఐదవసారి బడ్జెట్ ను ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్ ప్రవేశపెట్టారు. ఈ మేరకు ఆయన సభలో బడ్జెట్ ను ప్రారంభిస్తూ.. ఐదవసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇది అందరు అనుకున్నట్లు ఎన్నికల బడ్జెట్ కాదు.. ప్రజాకర్షక బడ్జెట్ అంటూ పేర్కొన్నారు. మొత్తం రూ.1,74,453.84 కోట్లతో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.1,25,454.70 కోట్లు కాగా, రెవెన్యూ మిగులు రూ. 5,520.41 కోట్లుగా ఉంది. >>బడ్జెట్‌లో కేటాయింపులు ఇలా.. * నీటి పారుదల రంగానికి రూ.25వేల కోట్లు * రెండు పడకగదుల ఇళ్లకు రూ.2,643కోట్లు * పంటల పెట్టుబడి మద్దతుకు రూ.12వేల కోట్లు * రైతు బీమా పథకానికి రూ.500 కోట్లు * వ్యవసాయ యంత్రీకరణకు రూ.522కోట్లు * పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధికి రూ.15,563కోట్లు * బిందు తుంపర సేద్యానికి రూ.127కోట్లు * ఎస్సీ ప్రగతికి రూ.16,453కోట్లు * ఎస్టీ ప్రగతి నిధికి రూ.9,693కోట్లు * సాంస్కృతిక శాఖకు రూ.58కోట్లు * యాదాద్రి అభివృద్ధికి రూ.250కోట్లు * వేములవాడ ఆలయ అభివృద్ధికి రూ.100కోట్లు * భద్రాద్రి ఆలయ అభివృద్ధికి రూ.100కోట్లు * బాసర, ధర్మపురి ఆలయాల అభివృద్ధికి రూ.50కోట్ల చొప్పున కేటాయింపు * గురుకులాలకు రూ.2,283కోట్లు * ఆర్‌ అండ్‌ బీకి రూ.5,575కోట్లు * విద్యుత్‌ రంగానికి రూ.5,650కోట్లు * చేనేత, జౌళి రంగానికి రూ.1200 కోట్లు * పరిశ్రమల శాఖకు రూ.1,286కోట్లు * ఐటీ శాఖకు రూ.289కోట్లు * పురపాలక శాఖకు రూ.7,251కోట్లు * గ్రామీణ స్థాని సంస్థలకు రూ.1500కోట్లు * పట్టణాభివృద్ధికి రూ.1000కోట్లు * దళితులకు మూడెకరాల భూ పంపిణీకి రూ.1,469కోట్లు * ఎస్టీల సంక్షేమానికి రూ.8,063కోట్లు * బీసీల సంక్షేమానికి రూ.5,920కోట్లు * ఎంబీసీ కార్పోరేషన్‌కు రూ.1000 కోట్లు