మద్యం మత్తులో...మహిళను ఇడ్చుకెళ్ళాడు

SMTV Desk 2017-06-28 17:46:01  drank, draiv, lady, scuty, car

మౌంట్ అబూ, జూన్ 28 : రోడ్డు ప్రమాదాలకు మద్యమే ప్రధాన కారణమని పలు నివేదికలు తేల్చిచెప్పాయి. మందు తాగి వాహనం నడుపుతూ రోడ్లపై నానా హంగామా చేయడమే కాకుండా, చివరికి మృత్యు ఒడిలోకి చేరుతున్న ఎంతో మందిని ప్రతిరోజూ చూస్తూనే ఉన్నాం. ఇటివల రాజస్థాన్ లో ఓ వ్యక్తి మద్యం మత్తులో వేగంగా వ్యాన్ ను నడుపుతూ స్కూటిని డీకొట్టిన ఘటన వార్తలలో సంచలనంగా మారింది. ఆ వ్యక్తి ఎంత మత్తులో ఉన్నాడంటే, తన వాహనం ఓ స్కూటిని డికొట్టి, ఒక మహిళను ఈడ్చుకుపోతుందన్న సంగతి కూడా గుర్తించలేకపోయాడు. దీనికి సంబంధించి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ ఘటన రాజస్థాన్ లోని మౌంట్ అబూలో జరిగింది. బుధవారం వ్యాన్ ను నడుపుతున్న ఓ వ్యక్తి స్కూటిని డికొట్టాడు. అతను మద్యం మత్తులో ఉన్నాడు. అతను ప్రమాదంలో ఒక మహిళ స్కూటి తన వ్యానుకు మధ్యలో పడింది అనే విషయాన్నీ కూడా గమనించలేదు. ఆ మందు బాబు వ్యాన్ డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు. స్కూటి, వ్యాన్ మధ్యలో చిక్కుకున్న బాధితురాలుని కొద్ది మీటర్ల దూరం వరకు అలానే ఈడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. దీన్ని గమనించిన అక్కడి స్థానికులు మద్యం మత్తులో ఊగుతున్న డ్రైవర్ ను చితకబాది పోలీసులకు అప్పగించారు. ఆ ఘటనలో చిక్కుకున్న బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.