భారత్ అంటే చైనాకు ఎందుకంత?

SMTV Desk 2017-06-28 17:30:50  Indian Government, Indian Army, China, Pakistan, Predator Drones

న్యూఢిల్లీ, జూన్ 28 : భారతదేశంలోని సైన్య వ్యవస్థను మరింత పటిష్టపరిచే విధంగా భారత ప్రభుత్వం కృషి చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా విదేశీ పర్యటనలో ఉన్న నరేంద్రమోదీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ల మధ్య ఆయుధాల సేకరణకు సంబంధించి ఒప్పందం కుదిరింది. రూ. 12 వేల కోట్లతో 22 ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలుకు సంబంధించి ఇరు దేశాలు అంగీకారాన్ని తెలిపాయి. ఈ డ్రోన్లకు సంబంధించిన అంశం గత సంవత్సరమే తెలియడం వల్ల చైనా, పాకిస్తాన్ దేశాలు భయబ్రాంతులకు లోనవుతున్నాయి. ముఖ్యంగా చైనాకు ఈ డ్రోన్ల కొనుగోలు ఒప్పందం అసలు నచ్చడం లేదు. ఎందుకంటే ఇవి ఎక్కువ శక్తి సామర్థ్యాలు కల్గి ఉండడమేనని రక్షణ శాఖ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ ద్రోన్లు 34 గంటల పాటు 50 వేల అడుగుల ఎత్తులో నిరాటంకంగా ఉండడమే కాకుండా, 1000 కిలోమీటర్ల దూరం వరకు శత్రువుల ఉనికిని, కదలికలను పసిగట్టే సామర్థ్యాన్ని కల్గి ఉన్నాయట. 1700 కిలోల పేలుడు పదార్థాలను కూడా ఇవి మోసుకు పోగలుగుతాయని , అత్యాధునిక టెక్నాలజీలతో, అత్యంత కచ్చితత్వంతో చాలా వేగంగా పని చేస్తాయని సమాచారం. ఈ కారణాల వల్లే చైనా, పాకిస్థాన్ లు ప్రిడేటర్ డ్రోన్ల గురించి భయపడుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.