పాదయాత్రగా "జనసేన జాతీయ ఐక్యత"..

SMTV Desk 2018-03-14 12:32:58  janasena formation day, padayatra, pawan kalyan, janasena jaatheeya aikyatha

అమరావతి, మార్చి 14 : జనసేన పార్టీ ఆవిర్భవించి నేటికి నాలుగు సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నేటి సాయంత్రం గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సమీపంలో జనసేన ఆవిర్భావ సభలను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో "జనసేన జాతీయ ఐక్యత" ఆ పార్టీ కార్యకర్తలు, సభ్యులు, అభిమానులు విజయవాడ నుండి పాదయాత్రగా బయలుదేరారు. ఈ యాత్ర విజయవాడ నుండి ఆవిర్భావ సభా వేదిక వరకు దాదాపుగా 14 కిలోమీటర్ల మేర జరగనుంది. సుమారు మూడు లక్షల మంది ఈ సభకు హాజరవుతారని అంచనా వేశారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆవిర్భావ సభ ప్రారంభం కానుంది. అనంతరం ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వేదికపై నుంచి ప్రసంగిస్తూ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నారు.