ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌ కన్నుమూత..

SMTV Desk 2018-03-14 12:17:13  Stephen Hawking dies, renowned scientist,

లండన్, మార్చి 14 : ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌ కన్నుమూశారు. ఎంతోకాలంగా పార్కిన్ సన్ వ్యాధితో చక్రాల కుర్చికే పరిమితమైన ఆయన.. ఖగోళ శాస్త్రంలోని ఎన్నో విషయాలపై అధ్యయనం చేసి ఎనలేని పేరు ప్రఖ్యాతలు ఘడించారు. 1942, జనవరి 8న ఇంగ్లండ్ లో జన్మించిన స్టీఫెన్.. సెయింట్ ఆల్బన్స్ స్కూల్ లో ప్రాథమిక విద్య, ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో బీఏ, కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో పీహెచ్‌డీ చేశారు. అంతేకాకుండా విశ్వ రహస్యాల గురించి "ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్" ఎనే పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకం అతి తక్కువ సమయంలోనే బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. ఈ పుస్తకాన్ని 35 భాషాల్లో తర్జుమా చేయగా.. కోటికి పైగా పుస్తకాలు అమ్ముడుపోయాయి. ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో స్టీఫెన్ నేటి ఉదయం తుది శ్వాస విడిచారు. ఆయన మృతితో శాస్త్ర సాంకేతిక సమాజం తీవ్ర విషాదంలో మునిగింది.