11 మంది కాంగ్రెస్ నేతలపై సస్పెన్షన్..!

SMTV Desk 2018-03-13 11:24:23  congress mlas, suspension, komati reddy venkat reddy, telangana assembly.

హైదరాబాద్, మార్చి 13 : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో భాగంగా నిన్న గవర్నర్ ప్రస౦గిస్తున్న సమయంలో ఒక దురదృష్టకరమైన సంఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గవర్నర్ పైకి విసిరిన హెడ్‌ఫోన్స్‌ తగిలి మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌పై కంటికి గాయమైన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యగా భావించి ఈ ఘటనకు బాధ్యులుగా 11 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేశారు. జానారెడ్డితోపాటు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టివిక్రమార్క, జీవన్‌రెడ్డి, గీతారెడ్డి, చిన్నారెడ్డి, డీకే అరుణ, పద్మావతి, టి.రామ్మోహన్‌రెడ్డి, డి.మాధవరెడ్డి, వంశీచంద్‌లపై సస్పెన్షన్‌ వేటు వేశారు. అలాగే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌ కుమార్‌ల సభ్యత్వాలు రద్దు చేసినట్లు శాసనసభాపతి మధుసూదనాచారి ప్రకటించారు. తెలంగాణ శాసనసభ చరిత్రలో నాలుగు సంవత్సరాల కాలంలో జరిగిన ఈ ఒక్క ఘటన మాయని మచ్చగా మిగిలిపోతుందని అన్నారు. కాగా ఈ బడ్జెట్‌ సమావేశాలు ముగిసేవరకూ కాంగ్రెస్ నేతలపై బహిష్కరణ ఉంటుందని ప్రకటించారు.