పెండింగ్ లో నేర నేతల కేసులు..

SMTV Desk 2018-03-12 13:15:14  MPs and MLAs, criminal cases, Uttar Pradesh, supreme court

న్యూఢిల్లీ, మార్చి 12: అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా పేరొందిన మన దేశంలో ప్రజా ప్రతినిధులుగా ఉన్న చాలా మంది పై కేసులు పెండింగ్ లో ఉన్నాయని కేంద్రం తెలిపింది. దేశమొత్తంగా 1,700 మందికి పైగా సిట్టింగ్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలపై 3,045 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని కేంద్రం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ఈ జాబితాలో దేశంలోనే పెద్ద రాష్ట్రమైన (జనాభా పరంగా) ఉత్తరప్రదేశ్‌ 248 మంది ఎంపీ, ఎమ్మెల్యేలతో తొలి స్థానంలో ఉంది. ఏపీ, తెలంగాణ, కేరళలతో పాటు మరో మూడు రాష్ట్రాల్లో వందకు పైగా ఎంపీలు, ఎమ్మెల్యేలు క్రిమినల్‌ కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారని కేంద్రం సుప్రీంకు నివేదించింది.