వైరల్ గా మారిన ‘విరుష్క’ జోడీ ఫోటోలు..

SMTV Desk 2018-03-12 12:39:22  virat kohli, anushka sharma, viral photos, nidahas trophy

ముంబయి, మార్చి 12 : విరాట్- అనుష్క శర్మ ఈ జంట ఎక్కడ కనిపించిన హాట్ టాపిక్.. వారి మధ్య ప్రేమ ఎన్నో ఉత్కంఠల మధ్య కొనసాగింది. ఇంకా వారి వివాహం అయితే కొన్ని రోజులు సోషల్ మీడియాలో చేసిన హల్ చల్ కోసం వేరే చెప్పక్కర్లేదు. ప్రస్తుతం టీమిండియా క్రికెట్ సారథి, పరుగుల వీరుడు విరాట్ కోహ్లి తన సతీమణి అనుష్క శర్మతో సరదాగా గడుపుతున్నాడు. వరుస మ్యాచ్ లతో అవిరామంగా ఆడిన కోహ్లికి శ్రీలంక వేదికగా జరుగుతున్నా నిదహాస్ ట్రోఫీకి బోర్డు అధికారులు విశ్రాంతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఖాళీ సమయాన్ని విరాట్‌, అనుష్క జంట చాలా ఎంజాయ్ చేస్తూ గడుపుతున్నారు. కాగా వారు తమ ఫోటోలను సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఇప్పుడు ఆ ఫోటోలు అంతర్జాలంలో ఫుల్ వైరల్ గా మారాయి. భర్తపై తనకున్న ప్రేమను తెలియజేస్తూ కోహ్లీకి ముద్దు పెడుతున్న ఫొటోను తన ఇన్‌స్టాగ్రాం ద్వారా పంచుకుంది. ఈ ఫోటోలు పై అభిమానులు తెగ కామెంట్లు పెడుతున్నారు.