విజయమే లక్ష్యంగా బరిలోకి రోహిత్ సేన..

SMTV Desk 2018-03-12 11:02:37  india vs srilanka, nidahas trophy, srilanka, rohit sharma

కొలంబో, మార్చి 12 : నిదహాస్ ట్రోఫీలో భాగంగా టీమిండియా క్రికెట్ జట్టు శ్రీలంక తో పోరుకు సిద్దమయ్యింది. తొలి మ్యాచ్ లో ఆతిధ్య జట్టు చేతిలో ఓడిన భారత్ ఈ మ్యాచ్ లో ఎలాగైనా నెగ్గాలని భావిస్తుంది. ఇప్పటికే మూడు జట్లు ఒక్కో గెలుపోటములతో సమానంగా ఉండడంతో ఫైనల్ పోరు రసవత్తరంగా మారింది. శ్రీలంక- బంగ్లాదేశ్ మ్యాచ్ లో బంగ్లా గెలిచిన తీరు అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ నేపధ్యంలో రోహిత్ సేన ఎటువంటి రన్ రేట్, వేరే జట్టు గెలుపు, ఓటమిల పైన ఆధారపడకుండా ఫైనల్ కు అర్హత సాధించాలంటే ఈ మ్యాచ్ లో తప్పక నెగ్గాలి. టీమిండియా బ్యాటింగ్ పరంగా కెప్టెన్ రోహిత్ ఫామ్ జట్టుని కలవరపరుస్తుంది. మరో వైపు ధావన్ తనదైన శైలిలో చెలరేగి ఆడుతున్నాడు. మిడిల్ ఆర్డర్ లో రైనా, పాండే, కీలకం కానున్నారు. బౌలింగ్ విభాగంలో పేసర్ జయదేవ్ ఉనద్కత్ వికెట్లు తీసిన పరుగులు ధారాళంగా ఇచ్చేస్తున్నాడు. విజయ్ శంకర్, శార్దుల్ ఠాకూర్ తో పాటు స్పిన్నర్ చాహల్, వాషింగ్టన్ సుందర్ రాణిస్తే భారత్ విజయం సులభం అవుతుంది. ప్రత్యర్ధి జట్టు భారత్ పై మొదటి మ్యాచ్ లో విజయం సాధించినప్పటికీ, బంగ్లాదేశ్ మ్యాచ్ లో భారీ స్కోర్ నిర్దేశించిన గెలుపు బాట పట్టలేకపోయింది. కానీ శ్రీలంక జట్టుని తక్కువ అంచనా వేయకుండా రోహిత్ సేన ప్రణాళికలు రచించాలి. ముఖ్యంగా బ్యాటింగ్‌లో ప్రమాదకర కుశాల్‌ పెరీరా, కుశాల్‌ మెండిస్‌లను తొందరగా పెవిలియన్ కు చేర్చడం కీలకం. కాగా బంగ్లాతో జరిగిన మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా లంక కెప్టెన్ చందిమాల్ పై రెండు మ్యాచ్ ల నిషేధం పడింది. అతని స్థానంలో తిసారా పెరీరా లంకకు నాయకత్వం వహించనున్నాడు.