నిఖిల్‌ని చూస్తుంటే డ్యూరాసెల్‌ బ్యాటరీ గుర్తొస్తుంది : అల్లరి నరేష్‌

SMTV Desk 2018-03-11 17:25:23  Kirik Party, nikhil, tollywood, Sharan Koppisetty

విజయవాడ, మార్చి 11: యువతేజం నిఖిల్ హీరోగా, సంయుక్త హెగ్డే, సిమ్రాన్‌ పరంజా కథానాయికల తెరకెక్కిన చిత్రం ‘కిరాక్‌పార్టీ’. శరణ్‌ కొప్ప శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంను, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ బ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. కన్నడలో ఘన విజయం సాధించిన ‘కిరిక్‌పార్టీ’కి రీమేక్‌ గా వస్తున్నా ఈ మూవీకు చందూ మొండేటి సంభాషణలు రాయగా, సుధీర్‌వర్మ స్క్రీన్‌ప్లే అందించారు. కాగా శనివారం రాత్రి విజయవాడలో ఈ చిత్ర ఆడియో విడుదల వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అల్లరి నరేష్‌ కళాశాల విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. "మార్చి 16న కాలేజ్‌కి బంక్‌కొట్టి సినిమాను చూడండి. నేను మీకు హాజరు వేయిస్తా. నిఖిల్‌ని చూస్తుంటే డ్యూరాసెల్‌ బ్యాటరీ గుర్తొస్తుంది. అంత ఎనర్జీగా ఉంటాడు. నిఖిల్‌కు ‘హ్యాపీడేస్‌’ ఎలాంటి విజయాన్ని ఇచ్చిందో ఈ సినిమా కూడా అదే స్థాయిలో హిట్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా" అని అన్నారు.