తెలంగాణకు కేంద్ర సాయం అంతంతే!

SMTV Desk 2018-03-11 14:59:21  Skoch Summit, minister ktr, Regional development & inclusive growth

న్యూఢిల్లీ, మార్చి 11: కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిందేమీ లేదని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. స్కాచ్‌ సంస్థ ఏర్పాటు చేసిన ‘ఒకే దేశం-ఒకే వేదిక’ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. పునర్విభజన చట్టప్రకారం రాష్ట్రానికి ఒక్క కేంద్ర సంస్థ రాలేదని, ఆంధ్రప్రదేశ్‌కు కొన్ని ఇచ్చారన్నారు. కేంద్రం తమ రాష్ట్రానికి ఇచ్చిన ప్రతిదానికీ లెక్కలున్నాయని తెలిపారు. కేంద్రం వాటాగా రూ.81వేల కోట్లు మాత్రమే వచ్చాయని పేర్కొన్నారు.. అందుకే కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నామన్నారు. కేంద్రమంత్రులకు, ప్రధానికి పలుసార్లు చెప్పినా ఫలితం లేదు. ఆంధ్రప్రదేశ్‌కు కూడా అదే ఎదురై ఉంటుంది. అందుకే ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి ఉంటారని కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. శివసేన ఎన్డీయే నుంచి తెదేపా కేంద్రప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన నేపథ్యంలో ఇక బలహీనపడ్డ అకాలీదళ్‌, భాజపా తప్ప ఏమీ లేవన్నారు.