నాన్నను చంపిన వారిని క్షమించేశాం: రాహుల్‌ గాంధీ

SMTV Desk 2018-03-11 11:53:48  rahul gandhi, singapore, comments, rajiv gandhi.

సింగపూర్, మార్చి 11 ‌: “నాన్న చనిపోతారని తమకు ముందే తెలుసని, కానీ ఆయన్ని చంపినవారిని క్షమించేశాం” అంటూ రాహుల్‌ ఉద్వేగానికి లోనయ్యారు. భారత మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ 1991లో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాహుల్‌ గాంధీ సింగపూర్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తన తండ్రి మరణం గురించి ప్రస్తావించారు. ‘నాన్న చనిపోయిన తర్వాత చాలా ఏళ్ల పాటు బాధపడ్డాం అంటూ ఉద్వేగానికి గురయ్యారు. రాహుల్‌ తన నానమ్మ ఇందిరా గాంధీ గురించి కూడా మాట్లాడారు. ‘రాజకీయాల్లో తప్పుడు వ్యక్తులకు వ్యతిరేకంగా నిలిచినా, దేని గురించైనా గట్టిగా పోరాడినా మనం చనిపోతాం. నా తండ్రి, నానమ్మ చనిపోతారని మేం ముందే ఊహించాం. తాను చనిపోతానని ముందే తెలుసని నానమ్మ నాకు చెప్పింది. ‘మీరు చనిపోతారు’ అని నేను నాన్నకు చెప్పాను. నా తండ్రిని చంపేసిన ఎల్‌టీటీఈ నేత ప్రభాకరన్‌ 2009లో చనిపోయినప్పుడు టీవీలో అతను నిర్జీవంగా పడి ఉండటం చూసి నాకు రెండు విషయాలు గుర్తుకు వచ్చాయి. ఆ తర్వాత నా సోదరి ప్రియాంకకు ఫోన్‌ చేశాను. ‘నాన్నను హతమార్చిన ప్రభాకరన్‌ చనిపోయాడు. ఇందుకు నేను సంతోషించాలి. కానీ నాకు ఈ భావనే కలగడంలేదు అని అప్పటి రోజులను గుర్తుచేసుకున్నారు రాహుల్‌.