మన బంధం చరిత్రాత్మకమైనది..

SMTV Desk 2018-03-10 12:37:43  france president, emmanuel macron, barath tour

న్యూఢిల్లీ, మార్చి 10 : భారత్ పర్యటనకు విచ్చేసిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుల్ మెక్రాన్‌ దంపతులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఘన స్వాగతం పలికారు. అనంతర౦ మెక్రాన్‌ త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మెక్రాన్‌ మీడియాతో మాట్లాడుతూ.. భారత్, ఫ్రాన్స్ మధ్య బంధాలు దృఢంగా ఉన్నాయి. మనవి రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాలు. మన బంధం చరిత్రాత్మకమై౦ది" అన్నారు. అక్కడి నుండి మెక్రాన్ దంపతులు నేరుగా రాజ్‌ఘాట్‌ చేరుకుని జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. నాలుగు రోజుల పాటు మెక్రాన్‌ భారత్‌లో పర్యటించనున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఆర్థిక, రాజకీయ సంబంధాలను బలోపేతం చేసుకునే లక్ష్యంతో ఈ పర్యటన సాగుతుందని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇందులో భాగంగా రెండు దేశాల మధ్య పలు ఒప్పంద సంతకాలు జరిగే అవకాశాలున్నాయి.