"పెద్దపులి" పాటతో అలరిస్తున్న నితిన్..

SMTV Desk 2018-03-10 11:35:57  nithin, peddapuli song, chal mohana ranga, thaman music.

హైదరాబాద్, మార్చి 10 : నితిన్ కథానాయకుడిగా కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కనున్న "ఛల్ మోహన రంగ" చిత్రానికి సంబంధించి.. ఒక్కో సాంగ్ ను విడుదల చేస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌‌గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌, సుధాకర్‌ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ స్వరాలూ సమకూరుస్తున్నారు. అయితే గత కొద్దిరోజుల నుండి ఈ చిత్రానికి సంబంధించిన ఒక్కో పాటను చిత్రబృందం విడుదల చేస్తూ వస్తోంది. గతంలో వచ్చిన "నువ్ పెద్ద పులి.. నువ్ పెద్ద పులినెక్కినావమో.. గండిపేట గండి మైసమ్మ" అనే పాటకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో అందరికి తెలుసు. తెలంగాణ యాస‌తో ఫుల్ మాస్ బీట్‌గా వచ్చిన "పెద్దపులి" పాటను తాజాగా తమన్ రూపొందించారు. ఇందులో నితిన్ తనదైన శైలిలో ఆడిపాడారు. ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకొని నిర్మాణా౦తర కార్యక్రమాలు జరుపుకుంటోంది. నితిన్ కు జోడీగా మేఘా ఆకాష్ నటిస్తున్నారు. ఇదివరకే వీరిద్దరూ కలిసి "లై" చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.