రాజ్యసభ స్థానానికి జయాబచ్చన్ నామినేషన్..

SMTV Desk 2018-03-09 18:10:54  Jaya Bachchan, nomination, Rajya Sabha, UTTARA PRADESH.

లక్నో, మార్చి 9 : రాజ్యసభ స్థానానికి ప్రముఖ బాలీవుడ్ నటి, సమాజ్‌వాదీ పార్టీ నేత జయాబచ్చన్ నామినేషన్ దాఖలు చేశారు. యూపీ నుండి సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నట్లు రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలు అందజేశారు. నామినేషన్ అనంతరం మీడియాతో మాట్లాడిన జయా బచ్చన్.. ములాయం సింగ్ యాదవ్ సహా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ధన్యవాదాలు తెలిపారు. సీనియర్లను కాదని మీకు పార్టీ టికెట్ ఎలా దక్కిందన్న ప్రశ్నకు సమాధానంగా.. తాను కూడా సీనియర్ నే అన్నారు. కాగా జయ నామినేషన్ వేసే సమయంలో ఆమె వెంట ఎస్పీ నేతలు డింపుల్ యాదవ్, రాజేంద్ర చౌదరి, కిరణ్మయి నందాతోపాటు సహారా గ్రూప్ అధినేత సుబ్రతారాయ్ తదితరులు ఉన్నారు. యూపీ నుండి 10 రాజ్యసభ స్థానాలకు మార్చి 23న ఎన్నికలు జరుగనున్నాయి.