మలాలాను కాల్చిన ఉగ్రవాదిపై 32కోట్ల రివార్డు..!

SMTV Desk 2018-03-09 17:45:58  MALALA YUSUF JOY, TERRARIST REWARD, 32 CRORES, AMERICAN GOVT.

వాషింగ్టన్, మార్చి 9 : పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ ఉద్యమకారిణి, నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌ జాయ్‌ను చంపేందుకు ప్రయత్నించిన ఉగ్రవాది తలపై అమెరికా ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. 2012 అక్టోబరు 9న మలాలాపై హత్యాయత్నంతో పాటు 2012 జూన్‌లో పాక్‌, అమెరికా ఆస్తులకు వ్యతిరేకంగా జరిగిన పలు ఉగ్రవాద కార్యకలాపాలకు టీటీపీ నేత మౌలానా ఫజుల్లా, మరో ఇద్దరు ఉగ్రవాదులు కారణమని అమెరికా ప్రభుత్వం వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదుల గురించి సమాచారం గానీ వారు ఎక్కడ ఉన్నారో తెలియజేసిన వారికి భారీ నజరానా ఇవ్వనుంది. కాగా మౌలానా ఫజుల్లా తలపై 5 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.32కోట్లు) , మరో ఇద్దరు ఉగ్రవాదులు అబ్దుల్‌ వలి, మంగల్‌ బాగ్‌లపై ఒక్కొక్కరిపై 3 మిలియన్‌ డాలర్ల రివార్డు ప్రకటించింది. కాగా 2015లో అమెరికా ప్రభుత్వం ఫజుల్లాను ప్రత్యేకమైన అంతర్జాతీయ ఉగ్రవాదిగా పేర్కొంది.