సోమవారమే అవిశ్వాసం : బొత్స

SMTV Desk 2018-03-09 16:43:30  ycp leader, Botsa Satyanarayana, central, government,

అమరావతి, మార్చి 9 : ఈ నెల 21న కాదు.. సోమవారమే కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడతామని వైకాపా నేత బొత్స సత్యనారాయణ అన్నారు. అవిశ్వాస తీర్మానం తర్వాత తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని ఆయన వెల్లడించారు. అలాగే, తెదేపా ఎప్పుడు పెట్టమంటే అప్పుడు పెడతామని, అవిశ్వాసానికి మద్దతు ఇస్తారో లేదో చంద్రబాబే తేల్చుకోవాలన్నారు. కేంద్ర మంత్రులుగా అశోక్‌గజపతిరాజు, సుజనా చౌదరి రాష్ట్రానికి ఏమి చేశారో వైకాపా నేత బొత్స సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. విమానయాన శాఖ మంత్రిగా అశోక్‌గజపతి రాజు ఏమీ చేయలేకపోయారని విమర్శించారు. భోగాపురం విమానాశ్రయం పేరుతో స్థిరాస్తి వ్యాపారం చేయాలని భావించారని ఆరోపించారు. మంత్రి పదవులకు రాజీనామా చేసిన వారిద్దరూ సంతృప్తిగా లేరన్నారు. ప్రత్యేక హోదా కోసమే మంత్రి పదవులకు రాజీనామా చేశామని వారు చెప్పుకోలేకపోతున్నారని బొత్స విమర్శించారు. రాష్ట్ర మంత్రులు ఓ మాట.. ఢిల్లీలో ఎంపీలు ఓ మాట మాట్లాడుతున్నారని ఆక్షేపించారు.