రాజ్యసభ వాయిదా..

SMTV Desk 2018-03-09 16:35:08  rajyasabha, postphoned, monday

న్యూఢిల్లీ, మార్చి 9: పలు అంశాలపై విపక్ష సభ్యులు ఆందోళనతో రాజ్యసభ కార్యకలాపాలను స్తంభింపజేశారు. విభజన హామీలు నెరవేర్చాలని తెదేపా సభ్యులు ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శించి తమ నిరసన తెలిపారు. డిప్యూటీ చైర్మన్‌ కురియన్‌ సభ్యులకు ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో సభను సోమవారానికి వాయిదా వేశారు. ఉదయం కూడా రిజర్వేషన్ల పెంపు బిల్లును ఆమోదించాలని తెరాస, ప్రత్యేక హోదా, విభజన హామీలు సాకారం చేయాలని తెదేపా సభ్యులు ఆందోళన చేయడంతో ఈ ఉదయం రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు 2.30 గంటలకు వాయిదా వేశారు. మధ్యాహ్నం సభ ప్రారంభం కాగానే సభ్యులు నినాదాలతో హోరెత్తించి సభా కార్యకలాపాలను అడ్డుకోవడంతో డిప్యూటీ చైర్మన్‌ కురియన్‌ సభను సోమవారానికి వాయిదా వేశారు.