మహమ్మద్ షమి @ 498ఏ, 323, 307

SMTV Desk 2018-03-09 15:51:29  cricketer, Shami, ipc sections, 498a, 323, 307, 376.

కోల్‌కతా, మార్చి 9 : టీమిండియా క్రికెటర్‌ మహమ్మద్ షమిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. షమికి ఇతర మహిళలతో సంబంధాలున్నాయని, గృహ హింసకు పాల్పడుతున్నారంటూ అతని భార్య హసీన్‌ జహాన్‌ కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు షమితో పాటు మరో నలుగురిపై ఐపీసీ 498ఏ, 323, 307, 376, 506, 328, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పెళ్లైన కొద్దిరోజులకే షమి గురించి తెలిసినా ఏమి చేయలేకపోయాను. అతనితో పాటు అతడి కుటుంబ సభ్యులు మానసికంగా, శారీరకంగా హింసించేవారని హాసీన్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల షమి భార్య హాసీన్‌ వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకున్న బీసీసీఐ కొత్తగా ప్రకటించిన కాంట్రాక్ట్‌ జాబితాలో షమి పేరు తొలగించారు.