రవితేజ తీరుని ఘాటుగా విమర్శించిన ఓ అభిమాని..

SMTV Desk 2017-06-28 11:42:16  raviteja, brother, bharath, death, fans, fire

హైదరాబాద్, జూన్ 28 : ఇటీవల హీరో రవితేజ తమ్ముడు భరత్, రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే భరత్ అంత్యక్రియలకు రవితేజ కుటుంబ సభ్యులు ఎవరు హాజరు కాకపోగా అతన్ని చివరి చూపు కూడా చూడడానికి ఇష్టపడలేదు. అయితే దీనిపై చాలా మంది వారి వారి అభిప్రాయాలను వ్యక్తం చేసారు. ఒక అభిమాని మాత్రం సోషల్ మీడియా ద్వారా రవితేజ కుటుంబ సభ్యుల తీరుపై ఘాటుగా స్పందించారు. మనిషి పుట్టినప్పుడు, చనిపోయినప్పుడు దేవుడి తో సమానం. ఈ రెండు సందర్బాలలో ఎంతటి విరోధి అయిన ఖచ్చితంగా చూడాలి. తన భార్యను ఎత్తుకెళ్ళిన రావణాసురుడిని, శ్రీరాముడు సంహరించిన తరువాత దగ్గరుండి విభీషణుడి చేత అంత్యక్రియలను జరిపించాడు. స్వయంగా రావణాసురుడి మృత దేహానికి నమస్కరించి తన ఔనత్యాన్ని చాటుకున్నాడు. అందుకే మనిషి చావుకి పిలవకపోయిన వెళ్ళాలి అంటారు. మనిషి బ్రతికి ఉన్నప్పుడు ఎన్నితప్పులు చేసిన, ఎంతటి శత్రువైన చనిపోయినప్పుడు ఖచ్చింతంగా వెళ్ళాలి. భరత్ మృతి పట్ల రవితేజ కుటుంబం చేసింది ముమ్మాటికి తప్పేనని, ఓ అభిమాని సోషల్ మీడియా ద్వారా తన విమర్శను తెలియజేసాడు.