పడిపోయిన పసిడి..

SMTV Desk 2018-03-08 18:59:44  gold rate, Gold rates In India, Gold,

ముంబై, మార్చి 8 : పసిడి ధర నేడు స్వల్పంగా పడిపోయింది. 10 గ్రాముల బంగారం ధర రూ.220 తగ్గి, రూ.31,450గా నమోదైంది. మరోవైపు వెండి ధర సైతం పడిపోయింది. కిలో వెండి ధర రూ. 400 తగ్గి, రూ. 39,500గా నమోదైంది. అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం, నగల వ్యాపారుల నుండి డిమాండ్ తగ్గడంతో పసిడి ధర తగ్గిందని వ్యాపార నిపుణుల అంచనా వేస్తున్నారు. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీ దారుల నుండి కొనుగోళ్లు పడిపోవడమే ఇందుకు కారణమని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు గ్లోబల్ మార్కెట్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.