ఓసారి షమి.. ఆత్మహత్యకు యత్నించాడు.

SMTV Desk 2018-03-08 17:39:09  cricketer, India bowler, Shami, hasin jahan,

న్యూఢిల్లీ, మార్చి 8 : టీమిండియా పేసర్‌ మహమ్మద్ షమి.. ఒకసారి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించినట్లు అతని భార్య హసీన్ జహాన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. "షమి, నేను కలుసుకోవడానికి ముందు తన సమీప బంధువుల్లో ఒక అమ్మాయిని షమి.. ఐదు సంవత్సరాల పాటు ప్రేమించి, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాడు. కాని వారి పెళ్ళికి పెద్దలు అంగీకరించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన షమి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు" అంటూ వెల్లడించింది. అంతేకాకుండా "నేను షమి కోసం అన్ని వదులుకున్నా. నా మోడలింగ్‌ కెరీర్, ఉద్యోగం ఇలా అన్నింటిని తన కోసం త్యాగం చేశా. కాని తను దక్షిణాఫ్రికా పర్యటన తర్వాత నుండి నన్ను వదిలించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. రెండేళ్ల నుండి విడాకులు ఇవ్వాలని కోరుతున్నాడు. కాని నేను విడాకులు ఇవ్వను. ఆస్తి, బీమాకు సంబంధించిన పత్రాలన్ని లాగేసుకున్నాడు. నేను షమిపై చేస్తున్న ఆరోపణలన్నింటికీ.. న దగ్గర ఆధారాలున్నాయి. త్వరలోనే అతన్ని కోర్టుకు ఈడుస్తా" అంటూ వెల్లడించింది. ఈ ఆరోపణల నడుమ షమి బీసీసీఐ కాంట్రాక్టును కోల్పోవాల్సి వచ్చింది.