నేను సేవకుడిగా చనిపోతా : కమల్

SMTV Desk 2018-03-08 16:47:19  Kamal Haasan, makkal neethi mayyam, ssn engineering college.

చెన్నై, మార్చి 8 : నేను ఒక నటుడిగా కాదు సేవకుడిగా చనిపోతానంటూ ప్రముఖ నటుడు, రాజకీయవేత్త కమల్ హాసన్ అన్నారు. ఇటీవల "మక్కల్ నీది మయ్యం" పేరిట పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. చెన్నైలోని ఎస్‌ఎస్‌ఎన్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన కమల్.. ఈ సందర్భంగా మాట్లాడారు. "నేను గొప్ప వ్యక్తినేం కాదు. ముందు నన్ను నేను ప్రేమిస్తాను. అలాగే విమర్శిస్తాను. నేను ఒక నటుడిగా కాకుండా ఒక సేవకుడిగా చనిపోతాను. నా పార్టీలో చేరడమనేది తర్వాత విషయం. ముందు ఓటు వేయండి. ఈ పార్టీ(మక్కల్ నీది మయ్యం) యువతకు అవకాశాలు ఇవ్వడానికే ఉంది" అంటూ పార్టీ గురించి చెప్పుకొచ్చారు.