తెలంగాణ ఏవియేషన్ అకాడమీ@నం.1

SMTV Desk 2018-03-08 14:43:43  WINGS INDIA, AVIATION ACADEMY, MINISTER KTR, BEGUMPET AIRPORT.

హైదరాబాద్, మార్చి 8 : ఏరోస్పేస్ రంగంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశగా కొనసాగుతోందని ఐటీ శాఖమంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు బేగంపేట ఎయిర్‌పోర్టులో వింగ్స్ ఇండియా 2018 ఏరోస్పేస్ సదస్సులో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. టీఎస్‌ఐపాస్‌తో 15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇవ్వనున్నామన్న కేటీఆర్.. నగరం చుట్టుపక్కల నాలుగు ఏరోస్పేస్ పార్కులు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. దేశంలోనే తెలంగాణ ఏవియేషన్ అకాడమీ నంబర్ వన్ అన్నారు. ఈ సదస్సులో 125 కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. మొత్తం 10 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. కాగా మూడు రోజుల పాటు ఏవియేషన్ షో కొనసాగనుంది.