"మహిళా దోనోత్సవ" శుభాకాంక్షలు..

SMTV Desk 2018-03-08 11:06:54  womens day, march 8, special editorial.

హైదరాబాద్, మార్చి 8 : మార్చి 8.. ఈ రోజు మహిళలకు ప్రత్యేకమైన రోజు.. పురుషాధిక్య కలిగిన ఈ సమాజంలో అన్ని రంగాలలోనూ స్త్రీ వివక్షకి గురవుతూనే ఉన్నా.. మహిళలంతా ఏకమై నిరసన తెలియజేసిన సందర్భాలు చరిత్రలో చాలా తక్కువ. నాటి బ్రిటిష్ కాలంలో ఒంటిచేత్తో వారిని తరిమికొట్టిన నారి శక్తి ఝాన్సీ రుద్రమదేవీ మొదలుకొని నేటి ఒలింపిక్స్ విజేత పీ.వీ సింధు వరకు తమ తమ రంగాలలో శక్తివంతమైన మహిళలుగా రాణిస్తున్నారు. దీనిని బట్టి చూస్తే ఒకరకంగా స్త్రీ ప్రగతి సాధించి శక్తివంతమైంది. సమాజంలో తమకంటూ గుర్తింపు తెచ్చుకొని అంచెలంచెలుగా ఎదుగుతోంది. కాని ఇంకా పలుచోట్ల మహిళలు అణచివేతకు గురవుతూనే ఉన్నారు. దీని నుంచి వారిని రక్షించాలంటే చట్టాలు మరింత కఠినతరం చేయాలి. అప్పుడే మన దేశ మహిళలకు నిజమైన అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఆడదంటే ఆధారపడేది కాదు.. ఆధారాన్నిచ్చేది. అవకాశం కాదు.. ఆదర్శం. ఆవేశం కాదు.. ఒక ఆలోచన.. ఎన్నో అవమానాలను ఆయుధాలుగా మలచుకొని తనకున్న సమస్యలను శక్తిగా మార్చి అద్భుత విజయాలను సాధిస్తూ.. నేటి మహిళా లోకానికి ఆదర్శంగా నిలుస్తున్న ప్రతి మహిళకు.. "మహిళా దినోత్సవ శుభాకాంక్షలు"..