తెరాసకు వ్యతిరేకంగా "నిశ్శబ్ద విప్లవం"..!

SMTV Desk 2018-03-07 18:44:58  kodangal MLA Revanth reddy, kcr, ktr, trs govt.

హైదరాబాద్, మార్చి 7 : రాష్ట్రంలో తెరాస ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక నిశ్శబ్ద విప్లవం జరుగుతోందని కోడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రజా చైతన్య యాత్రలో భాగంగా రాజన్న సిరిసిల్ల నుండి కామారెడ్డి వైపు వెళ్తున్న క్రమంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అనే ఒక సెంటిమెంట్ తో గెలిచిన కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్.. రాష్ట్ర ప్రజలను మోసం చేశారని.. ఆ ఘనత తెరాసకే దక్కుతుందని దుయ్యబట్టారు. కేసీఆర్ కుటుంబానికి ఇవే చివరి ఎన్నికలంటూ జోస్యం చెప్పారు. వారి కుటుంబానికి ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరపడ్డాయన్నారు.