బాలిక పై బాలుడి అత్యాచారం

SMTV Desk 2017-06-27 16:45:22  child, girl, rape, child, boy

ఢిల్లీ, జూన్ 27 : ఈ మధ్య బీహార్ లో పదవ తరగతి చదువుతున్న బాలిక పై అత్యాచారం చేసిన ఘటన మరువక ముందే మళ్ళీ ఇంకో సంఘటన వెలుగు లో కి వచ్చింది. 15 ఏళ్ల బాలిక పై 17 బాలుడు అత్యాచారం చేసిన ఘటన ఢిల్లీ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఢిల్లీ నగరంలోని జహంగీర్ పూరి ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల బాలిక ఎదురింట్లో 17 బాలుడు నివాసం ఉండేవాడు. ఆ బాలిక ఇంట్లో ఎవరు లేని సమయంలో బాలుడు ఇంటికి వెళ్లి ఆమె పై అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బాలిక ను బెదిరించాడు. ఇలా వారం రోజులగా బాలిక పై అత్యాచారం చేస్తున్నాడు. ఒక రోజు బాలిక వాళ్ళ అమ్మకు ఈ విషయం చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు బాలుడు పరారిలో ఉన్నట్లు చెప్పారు.