మాస్టర్ బ్లాస్టర్ కు ప్రత్యేక ఆహ్వానం..!

SMTV Desk 2018-03-06 13:25:36  sachin tendulkar, srilanka criket board, president tilanga sumathipala, independence day.

న్యూఢిల్లీ, మార్చి 6 : మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కు శ్రీలంక.. తమ స్వాతంత్ర్య వేడుకలకు ప్రత్యేక ఆహ్వానం పంపింది. ఈ ఏడాదితో శ్రీలంక 70 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకలు జరుపుకుంటోంది. ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న ఈ వేడుకలకు శ్రీలంక క్రికెట్ బోర్డు సచిన్ కు ప్రత్యేక ఆహ్వానం పంపింది. ఈ మేరకు క్రికెట్ బోర్డు అధ్యక్షుడు తిలంగ సుమతిపాల.. సచిన్ కు ఒక లేఖ రాశారు. ఈ లేఖలో ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలని, అక్కడ జరిగే మ్యాచ్ లను ప్రత్యక్షంగా వీక్షించాలని పేర్కొన్నారు. ఈ విషయంపై స్పందించిన సచిన్.. "ముందుగా 70ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకొంటున్న లంకకు, ఆ దేశ ప్రజలకు శుభాకాంక్షలు. బిజీ షెడ్యూల్‌ కారణంగా అక్కడకు రాలేకపోతున్నాను" అని తెలిపారు. గతంలో లంక 50ఏళ్ల స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించిన సమయంలో భారత్‌-శ్రీలంక-న్యూజిలాండ్‌ మధ్య ముక్కోణపు వన్డే సిరీస్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే.